Share News

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అగ్నిగుండమే: కౌశిక్‌రెడ్డి

ABN , Publish Date - Dec 15 , 2024 | 03:56 AM

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే అగ్నిగుండమే: కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ సర్కారు విస్మరించడం వల్లే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. అందుకే తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వనందుకే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్‌పై ముఖ్యమంత్రి కక్ష కట్టారని.. కావాలనే అరెస్టు చేయించారని ఆరోపించారు.

Updated Date - Dec 15 , 2024 | 03:56 AM