Panjagutta : పొలిటికల్ కార్టూనిస్టులు కనుమరుగయ్యే ముప్పు
ABN , Publish Date - Jul 22 , 2024 | 03:54 AM
పొలిటికల్ కార్టూన్లు, కార్టూనిస్టుల వృత్తి అంతరించి పోయే ప్రమాదం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఒకప్పుడు పత్రికల్లో కార్టూన్లు మొదటి పేజీలో వచ్చేవని, ప్రస్తుతం లోపలి పేజీల్లోకి పోయాయని తెలిపారు. పొలిటికల్ కార్టూన్లు, కార్టూనిస్టులను కాపాడుకోవాలన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి
నర్సింకు కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానం
పంజాగుట్ట, జూలై 21(ఆంధ్రజ్యోతి): పొలిటికల్ కార్టూన్లు, కార్టూనిస్టుల వృత్తి అంతరించి పోయే ప్రమాదం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఒకప్పుడు పత్రికల్లో కార్టూన్లు మొదటి పేజీలో వచ్చేవని, ప్రస్తుతం లోపలి పేజీల్లోకి పోయాయని తెలిపారు. పొలిటికల్ కార్టూన్లు, కార్టూనిస్టులను కాపాడుకోవాలన్నారు.
కార్టూనిస్ట్ శేఖర్ మిత్రులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు-2024 ప్రదానోత్సవ సభ జరిగింది. ప్రముఖ కార్టూనిస్ట్ పి.నర్సింకు కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డును కె.శ్రీనివా్‌సరెడ్డి.. జర్నలిస్ట్, కవి ప్రసేన్, విమలక్క, మాజీ సంపాదకుడు ఎస్.వీరయ్య, చంద్రకళా శేఖర్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భం గా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ భూమి సమస్యకు సంబంధించిన ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టారని, ఇంకో 3 వేల పైచిలుకు మంది జర్నలిస్టులుంటారని, వారికి నగరం నలు వైపులా స్థలం కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. మీడియా అక్రెడిటేషన్ గౌరవం పెంచుతామని, ఎవరికి పడితే వారికి అక్రెడిటేషన్ ఇవ్వబోమని అన్నారు. అక్రెడిటేషన్ల మార్గదర్శకాల కోసం త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.