Share News

Deputy CM Pawan Kalyan: మరికాసేపట్లో కొండగట్టుకు పవన్

ABN , Publish Date - Jun 29 , 2024 | 06:58 AM

మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతంలో వారాహికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు.

Deputy CM Pawan Kalyan: మరికాసేపట్లో కొండగట్టుకు పవన్

జగిత్యాల: మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతంలో వారాహికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్‌‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు.


కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ ప్రయాణమవుతారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30గంలకు హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు. తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 06:59 AM