Share News

Damodar: పెట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో సంతాన సాఫల్య సేవలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 03:36 AM

ఇక నుంచి పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇన్‌ఫెర్టిలిటీ(సంతాన సాఫల్య) సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Damodar: పెట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో సంతాన సాఫల్య సేవలు

  • డిసెంబరు 2న ప్రారంభించనున్న మంత్రి దామోదర

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఇక నుంచి పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇన్‌ఫెర్టిలిటీ(సంతాన సాఫల్య) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఈ సేవలు అందిస్తుండగా, పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో డిసెంబరు 2న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ సేవలను ప్రారంభించనున్నారు. సంతానం లేని దంపతులకు ఆస్పత్రిలో ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) చికిత్సలు అందిస్తామని పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రజనీరెడ్డి వివరించారు. ఇన్‌ఫెర్టిలిటీ సేవల కోసం ప్రత్యేక ఆధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


సంతానం లేని దంపతులకు ముందుగా పరీక్షలు చేస్తారని, ముందుగా మందులు ఇచ్చి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. భార్య, భర్తలో ఎవరిలో లోపం ఉంటే వారికి మందులతో నయం చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. అండాలను అభివృద్ధి చేయడం, వీర్యకణాలను పరిపుష్టి చేయడం వంటి చికిత్స పద్దతులు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. పైసా ఖర్చు లేకుండానే ఈ సేవలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

Updated Date - Dec 01 , 2024 | 03:36 AM