Share News

CV Anand: జాతీయ మీడియాకు..హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ క్షమాపణలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:50 AM

జాతీయ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడినందుకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

CV Anand: జాతీయ మీడియాకు..హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ క్షమాపణలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడినందుకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సోమవారం ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘పుష్ప-2 ప్రీమియంషో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగిన సందర్భంలో నేను సహనాన్ని కోల్పోయాను. జాతీయ మీడియా గురించి అనవసర వ్యాఖ్యలు చేశాను. నేను ప్రశాంతంగా ఉండాల్సింది. నా వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను మనస్పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను’’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 04:50 AM