Home » CV Anand
కొన్ని రోజులుగా నగరంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను సడలిస్తూ సోమవారం సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిసరాల్లో బీఎన్‌ఎ్‌స 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.
డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపిన సైబర్ మాయగాళ్లు.. జనాన్ని భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. పోలీసు అధికారుల చిత్రాలను డిస్ప్లే పిక్చర్(డీపీ)గా పెట్టుకుని వాట్సాప్ కాల్స్ చేస్తూ జనాన్ని బురిడి కొట్టించాలని చూస్తున్నారు.
పీస్ వెల్ఫేర్ కమిటీలో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. ఇటీవల నగరంలో జరిగిన సున్నిత, మతపరమైన సమస్యలపై పరస్పరంగా చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
వాట్సాప్, స్నాప్‌చాట్, వీవోఐపీ.. ఏ టెక్నాలజీ వాడినా, కొత్త ఎత్తులు ఎన్ని వేసినా సిటీ పోలీస్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసుల నుంచి డ్రగ్ స్మగ్లర్లు, వినియోగదారులు తప్పించుకోలేరని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) హెచ్చరించారు. తమ వద్ద అత్యాధునిక టూల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
Telangana: హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్‌పై సీపీ సీవీ ఆనంద్ సంచలన విషయాలు బయటపెట్టారు. బెంగళూరు, గోవా, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతాయని తెలిపారు. అలాగే డ్రగ్స్ డెలివరీలో కీలకంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు తెలియజేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) హెచ్చరించారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయన గురువారం కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించి పలు కేసులను విచారించారు.
ఇటీవల నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉద్రిక్తతను హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ సమీక్షించారు. కొద్ది రోజుల క్రితం మహ్మద్ మజీద్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి ఫిరోజ్ గాంధీ నగర్లో సిసి రోడ్డుకు సంబంధించిన సివిల్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో...
‘స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) విధులంటే ఆషామాషీ కాదు. మీరిచ్చే సమాచారం చాలా కీలకం. గ్రౌండ్ రిపోర్టును బట్టే ఉన్నతాధికారుల చర్యలుంటాయి. నిఘా విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
‘ప్రజలకు దూరం.. అధికారులకు భారం.. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు.. సీపీని కలవడం ఓ ప్రహసనం..’ గతంలో బంజారాహిల్స్(Banjara Hills)లోని కమాండ్కంట్రోల్ సెంటర్లో ఉన్న సిటీ పోలీస్ కమిషనరేట్ గురించి ఉన్న అభిప్రాయం ఇది.
మతపరమైన కార్యక్రమాలు, ర్యాలీల్లో డీజే శబ్దాలు, బాణాసంచా శబ్దాలు శృతి మించుతున్నాయని, వీటిని వెంటనే కట్టడి చేయాలని సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) సూచించారు. మతపరమైన ర్యాలీల్లో డీజేలు, టపాసుల వినియోగంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.