గంజాయి కేసులో ఇరికించారని మనస్తాపం
ABN , Publish Date - Oct 14 , 2024 | 05:05 AM
గంజాయి చోరీ కేసులో తనను బలిపశువు చేశారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో దసరా రోజే జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
దసరా రోజే కానిస్టేబుల్ ఆత్మహత్య
గంజాయి చోరీ కేసులో సస్పెండైన సాగర్
ఇద్దరు ఎస్ఐలు, మరో వ్యక్తి కలిసి తనను
బలి పశువును చేశారంటూ సెల్ఫీ వీడియో
బూర్గంపాడు/ఏన్కూరు, అక్టోబరు 13: గంజాయి చోరీ కేసులో తనను బలిపశువు చేశారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో దసరా రోజే జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 2013 కానిస్టేబుల్ బ్యాచ్, ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (33) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన సమయంలో ఈ ఏడాది జనవరిలో ఆ స్టేషన్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి మయామైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్ సాగర్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు.
మళ్లీ ఈనెల 10న ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వగా సస్పెండైనప్పుడు బూర్గంపాడు పోలీస్టేషన్లో ఉన్న ఎస్సై రాజ్‌కుమార్ ఆ పోలీస్టేషన్లో ఉండటంతో మనస్థాపం చెందిన సాగర్ ఈనెల 12న ఏన్కూరు సాగర్ కాలువ సమీపంలో పురుగులమందు తాగాడు. అంతకంటే ముందే కానిస్టేబుల్ సాగర్ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి కుటుంబసభ్యులకు పంపాడు. అందులో.. గంజాయి చోరీ కేసులో తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బూర్గంపాడు పోలీ్‌సస్టేషన్ ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమార్ బూర్గంపాడుకు చెందిన గొనెల నానితో కలిసి గంజాయిని అమ్ముకున్నారని పేర్కొన్నాడు. గంజాయి మాయమైన వ్యవహారంలో ఈ ఇద్దరు ఎస్ఐల పాత్ర ఉందని, వారిని వదిలేసి తనపై చర్యలు తీసుకోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపాడు.
పురుగులమందు తాగిన సాగర్‌ను కుటుంబసభ్యులు ఖమ్మం తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5గంటలకు మృతిచెందాడు. కానిస్టేబుల్ సాగర్‌కు భార్య తేజస్విని, ఏడేళ్ల కుమార్తె వేద సహస్ర, ఐదేళ్ల కుమారుడు మన్విత్ సాయి ఉన్నారు. సాగర్ తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఇద్దరు ఎస్సైలు, బూర్గంపాడు సీఐ సత్యనారాయణ, మరో వ్యక్తి గోనెల నానిపై కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాగర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు తనను తీవ్రంగా వేధించారని ఆరోపించాడు. జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ దళితులు, గిరిజనులను చిన్న చూపు చూసే వారని ఆరోపించాడు. బాధ్యులపై చర్యలు తీసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకున్నాడు.