Share News

Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:04 AM

తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం

  • తిరుమల తరహాలో ఏర్పాటు చేస్తాం : మంత్రి పొన్నం

సిరిసిల్ల, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న కార్తీక మాసంలోగా భక్తులకు నిత్యాన్నదాన సత్రం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సత్రం ఏర్పాటుకు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఆలయ ఆభివృద్ధి కోసం రూ 50 కోట్లు మంజూరు చేశామని, బ్రేక్‌ దర్శనం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 04:04 AM