Share News

Ponnam Prabhakar: ప్రతిపక్షాలిచ్చింది చార్జ్‌షీట్‌ కాదు రిప్రజంటేషన్‌

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:08 AM

ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్‌షీట్‌ కాదని, దాన్ని రిప్రజంటేషన్‌గా తాము భావిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Ponnam Prabhakar: ప్రతిపక్షాలిచ్చింది చార్జ్‌షీట్‌ కాదు రిప్రజంటేషన్‌

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే: పొన్నం

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్‌షీట్‌ కాదని, దాన్ని రిప్రజంటేషన్‌గా తాము భావిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వారు చార్జ్‌షీట్‌ పేరిట ఇచ్చిన ప్రజంటేషన్‌ను రిప్రజంటేషన్‌గా భావించి అందులోని అంశాలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏడాది పాలన తర్వాత మమ్మల్ని విమర్శించి చార్జ్‌షీట్‌ వేస్తే బాగుండేది కానీ, ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదు, రెండూ ఒక్కటేనని విమర్శించారు.


ప్రభుత్వం ఏర్పడిన నెలకే ‘ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో?’ అంటూ పిల్లి శాపనార్ధాలు పెట్టారని, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పని ఒత్తిడి కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్‌ తనకు ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీకి అధికారుల ద్వారా ఆహ్వానాన్ని పంపించామన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 04:08 AM