Share News

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

ABN , Publish Date - Nov 07 , 2024 | 04:08 AM

‘‘ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్‌ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’

Professor Haragopal: ప్రజల పక్షాన నిలిచిన టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యమా?

  • నిర్మల్‌ జిల్లాలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటును ప్రభుత్వం పునఃసమీక్షించాలి: హరగోపాల్‌

బర్కత్‌పుర, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్‌ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’’ అని ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ ప్రశ్నించారు. నిర్మల్‌ జిల్లాలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాం డ్‌ చేశారు. ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ను బేషరతుగా ఎత్తివేయాలన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించకపోతే పెద్దఎత్తున ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాంతో కలిసి విజయ్‌కుమార్‌ పోరాటం చేశారని గుర్తు చేశారు. టీపీజేఏసీ కో-కన్వీనర్లు కన్నెగంటి రవి, అం బటి నాగయ్య, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, భారత్‌ జోడో అభియాన్‌ కో-ఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 04:08 AM