Share News

Uppala Narasimham: సీనియర్‌ కథారచయిత వుప్పల నరసింహం కన్నుమూత

ABN , Publish Date - Nov 15 , 2024 | 04:57 AM

ప్రముఖ కథారచయిత, కవి, మావోయిస్టు సిద్ధాంతంపై విమర్శనాత్మక రచనలు చేసిన వుప్పల నరసింహం(70) కన్నుమూశారు.

Uppala Narasimham: సీనియర్‌ కథారచయిత వుప్పల నరసింహం కన్నుమూత

  • మావోయిస్టులపై పలు విమర్శనాత్మక రచనల ప్రచురణ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథారచయిత, కవి, మావోయిస్టు సిద్ధాంతంపై విమర్శనాత్మక రచనలు చేసిన వుప్పల నరసింహం(70) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం గోల్నాకలోని స్వగృహంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. నరసింహం స్వస్థలం రంగారెడ్డి జిల్లా దేవరయాంజల గ్రామం. ఆంధ్రప్రభలో సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా సేవలందించారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ‘రక్తచరిత్ర’, ‘జంగల్‌నామాపై జనం ప్రజా ప్రశ్న’, ‘విధ్వంసమే విప్లవమా?’ తదితర రచనలు చేశారు. ఆయన రాసిన కథలు ‘మట్టి మనిషి’ సంపుటిగా వెలువడ్డాయి. నరసింహం మృతిపట్ల పలువురు కవులు, రచయితలు, పాత్రికేయ సంఘం ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. నరసింహం అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు గోల్నాకలోని శ్మశానవాటికలో నిర్వహించ నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Nov 15 , 2024 | 04:57 AM