Share News

Health Report: స్థిరంగా శ్రీతేజ ఆరోగ్యం

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:25 AM

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన, శాస్వ రేటు స్థిరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Health Report: స్థిరంగా శ్రీతేజ ఆరోగ్యం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన, శాస్వ రేటు స్థిరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌ఫైనే చికిత్స అందిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి వైద్యులు చేతన్‌ ఆర్‌.ముందాడ, విష్ణు తేజ్‌పూడి వివరించారు. శస్త్రచికిత్స చేసి శ్వాస నాళంలో ఏర్పాటు చేసిన పైపు నుంచి ఆక్సిజన్‌ను అవసరం మేరకు అందిస్తున్నట్లు చెప్పారు.


ద్రవాహారాన్ని అందిస్తున్నామని, బాగానే తీసుకుంటున్నాడని తెలిపారు. నాడీ సంబంధిత స్థితి అలాగే ఉందని, అవయవాల కదలికలు మెరుగుపడలేదని చెప్పారు. ఇంకా కళ్లు తెరవడం లేదని, పేరు పెట్టిన పిలిచినా ప్రతిస్పందన లేదని పేర్కొన్నారు. శ్రీతేజకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 21 , 2024 | 04:25 AM