Share News

BJP: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య ఎంపిక..

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:20 PM

ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

BJP: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య ఎంపిక..
R Krishnaiah

న్యూఢిల్లీ, డిసెంబర్ 09: బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య జాక్ పాట్ కొట్టేశారు. ఆయన బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయనకు.. బీజేపీ అదే పదవిని కట్టబెట్టింది. అవును, ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మూడు రాష్ట్రాల బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 01:38 PM