Share News

Rachakonda CP: 30 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే.. ఆయుధ లైసెన్స్‌ రద్దు

ABN , Publish Date - May 31 , 2024 | 11:15 AM

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లైసెన్స్‌డ్‌ ఆయుధాలపై సీపీ తరుణ్‌ జోషి(CP Tarun Joshi) దృష్టి సారించారు. లైసెన్స్‌డ్‌ ఆయుధాలకు సంబంధించి పలు ఫిర్యాదులు రావడంతో కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌(Malkajigiri Zone)లో ఆయుధ లైసెన్సులు కలిగిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Rachakonda CP: 30 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే.. ఆయుధ లైసెన్స్‌ రద్దు

- ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సీపీ

హైదరాబాద్‌ సిటీ: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లైసెన్స్‌డ్‌ ఆయుధాలపై సీపీ తరుణ్‌ జోషి(CP Tarun Joshi) దృష్టి సారించారు. లైసెన్స్‌డ్‌ ఆయుధాలకు సంబంధించి పలు ఫిర్యాదులు రావడంతో కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌(Malkajigiri Zone)లో ఆయుధ లైసెన్సులు కలిగిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పాలు విరిగిపోయాయని గృహిణికి చిత్రహింసలు


ఆయుధ లైసెన్స్‌, ఆయుధాలు కలిగి ఉన్న వారు, వాటిని రెన్యూవల్‌ చేసుకోదలచుకున్న వారు, ఆయుధాలు తమకు ఎందుకు కావాలో అన్న విషయంపై కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. ఆయుధ లైసెన్స్‌లు ఉన్న వారు 30 రోజుల్లోగా కమిషనర్‌ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి నోటీసులు లేకుండా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేస్తామని సీపీ హెచ్చరించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 31 , 2024 | 11:15 AM