Share News

Rain Effect: రెయిన్ ఎఫెక్ట్ ..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం

ABN , Publish Date - May 16 , 2024 | 05:11 PM

హైదరాబాద్‌(hyderabad)లో దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి (rain) అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

Rain Effect: రెయిన్ ఎఫెక్ట్ ..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం
Rain effect in hyderabad Huge traffic jam

హైదరాబాద్‌(hyderabad)లో దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి (rain) అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షంతో ప్రధాన మార్గాలు ఎక్కడికక్కడ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్(traffic jam) స్తంభించిపోయింది. దీంతో భాగ్యనగరంలో ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రింది మ్యాపులో రెడ్ లైన్ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.

ట్రాఫిక్ జామ్ ఈ ప్రాంతాల్లోనే..

Untitled-3.jpg


ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతాలైన నాంపల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మరోవైపు రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంది. దీంతోపాటు కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఉప్పల్, బాచుపల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, యూసఫ్ గూడ, నిజాం పేట సహా పలు ప్రాంతాల్లో వర్షం రాకతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిన పలు ప్రాంతాలను క్లియర్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

TS News: అలర్ట్.. అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు..!!


Prathipati Pullarao: పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే అనుమానాలు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 06:25 PM