Share News

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 10:46 AM

ఎట్టకేలకు నేవీ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు (Arrests) కొనసాగుతున్నాయి. పూడూరు మండలం, దామగుండం రాడార్ స్టేషన్ ప్రారంభోత్సవం (Inauguration of Radar Station) సందర్భంగా పోలీసులు ఈ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, సీడబ్ల్యూవో రాష్ట్ర కార్యదర్శి వై. గీతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 మంది వివిధ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఎట్టకేలకు నేవీ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు. గౌరవ అతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, శాసన మండలి చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, నేవీ, రక్షణశాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఇందుకు సంబంధించి కేంద్ర నేవీ, రక్షణ శాఖ అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేశారు. దామగుండం అడవుల్లో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని 2010-11లో నేవీ శాఖ నిర్ణయించింది. అనేక అవాంతరాల నడుమ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పర్యావరణం, అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలు, కాలుష్య నియంత్రణ బోర్డు తదితర 16 రకాల అనుమతులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్‌లన్నీ లభించాయి. ఈ ప్రాంతంలోని రిజర్వ్‌ ఫారెస్టు ఆధీనంలో ఉన్న 2,935 ఎకరాల భూములను సీఎం సమక్షంలో అటవీ అధికారులు జనవరి 24న నేవీ శాఖకు అప్పగించారు. దీంతో 14 ఏళ్ళుగా పెండింగ్‌లో ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు ఇప్పుడు మోక్షం లభించింది.


రూ.3200 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం

ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అంచనా వ్యయం మొదట్లో రూ.1900 కోట్లు తర్వాత రూ.2500 కోట్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం రూ.3200 కోట్లకు పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010-12లో ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం కాగా, 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు రాగా, భూముల కేటాయింపు విషయంలోనే జాప్యం జరుగుతూ వచ్చింది. చివరికి మార్గం సుగమమైంది.

భారీ బందోబస్తు

నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. వేదిక వద్ద కేంద్ర రక్షణ, నేవీ శాఖలతో పాటు ప్రత్యేక కమాండోలతో రక్షణ వలయం ఏర్పాటు చేయగా, బయట బందోబస్తు కోసం భారీగా పోలీసులను మోహరించనున్నారు. 400 మందికి పైగానే ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. సభా ప్రాంగణంలో 500 మంది మాత్రమే కూర్చునేలా, మరో 200 మందికి వెసులుబాటు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పోలీసు సిబ్బందితో సమీక్షించి తగిన సూచనలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు..

తుఫాన్‌గామారనున్న అల్పపీడనం..

ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..

ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 10:46 AM