TG News: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?
ABN , Publish Date - May 24 , 2024 | 04:09 PM
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యలపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు.
చేవెళ్ల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy), అతని కుటుంబ సభ్యలపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు (శుక్రవారం) కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి పెట్టి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమిని తనకు ఇవ్వాలని అడిగితే పంజాబ్ గ్యాంగ్‌తో మారణాయుధాలతో దాడి చేసి భయాబ్రాంతులకు గురి చేశారని సదరు బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తన భూమిని జీవన్‌రెడ్డి నుంచి విడిపించాలని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, జీవన్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ (ఆరు సెక్షన్ల కింద) పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని
బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!
పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్
Read Latest APNews and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News