BRS: బీఆర్‌ఎస్‌కు రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
ABN , Publish Date - May 05 , 2024 | 05:08 AM
మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు స్పీడ్ పోస్టు ద్వారా పంపారు.
న్యూఢిల్లీ, మే 4(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు స్పీడ్ పోస్టు ద్వారా పంపారు. కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉందని రాపోలు అన్నారు. తన లాంటి నేతలను బీఆర్‌ఎ్‌సలో ఆహ్వానించి, తీరా చేరాక పార్టీ గడప బయటే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎ్‌సకు తన అవసరం లేదని భావించి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని, కుల గణన దిశగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు. తనతో పాటు మెదక్ జిల్లా నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసినట్లు చెప్పారు.