Share News

Hyderabad: ప్రముఖ గైనకాలజిస్ట్‌ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూత

ABN , Publish Date - Oct 16 , 2024 | 04:04 AM

ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కొత్త ఉషాలక్ష్మి (91) మరణించారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. గుంటూరుకు చెందిన డాక్టర్‌ ఉషాలక్ష్మి.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు.

Hyderabad: ప్రముఖ గైనకాలజిస్ట్‌ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూత
Gynecologist Kota Ushalakshmi

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కొత్త ఉషాలక్ష్మి (91) మరణించారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన డాక్టర్‌ ఉషాలక్ష్మి.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆమె సుదీర్ఘకాలం సేవలందించారు.


క్యాన్సర్‌ను జయించి..

69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన ఉషాలక్ష్మి.. ఆ వ్యాధికి ఎదురొడ్డి విజేతగా నిలిచారు. దీంతో ఆమె కుమారుడు డాక్టర్‌ రఘురామ్‌ 2007లో కిమ్స్‌-ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫాండేషన్‌ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోగులకు అధునాతన వైద్య సేవలందిస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్‌ పవర్‌ రన్‌ పేరిట ఇటీవల నిర్వహించిన అవగాహన ర్యాలీలో డాక్టర్‌ ఉషాలక్ష్మిని సీఎం రేవంత్‌ రెడ్డి సత్కరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 16 , 2024 | 07:11 AM