Share News

Allu Arjun Arrest,: అల్లు అర్జున్ కేసులో కొత్త ట్విస్ట్.. మృతురాలి భర్త ఏమన్నారంటే..

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:22 PM

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి భర్త మాట్లాడుతూ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎందుకు అలా చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Allu Arjun Arrest,: అల్లు అర్జున్ కేసులో కొత్త ట్విస్ట్.. మృతురాలి భర్త ఏమన్నారంటే..
Revathis husband Bhaskar said

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో ఓ మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ దీనిపై మృతురాలి రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ.. ఈ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ విషయం తనకు తెలియదని, టీవీలో చూసి విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. తన భార్య మరణించిన తొక్కిసలాటతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కోడుతోంది.


14 రోజుల జైలు శిక్ష

ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ 14 రోజుల జైలు శిక్ష అనుభవించనున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) నటుడిని ఇంటి నుంచి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు సాయంత్రం అల్లు అర్జున్‌ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.


ఏం జరిగిందంటే..

నిజానికి డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వెళ్లారు. ఆ క్రమంలో వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. దీంతో మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 105, 118 (1) కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి ముందు మహిళ మృతికి సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 11న అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.


Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..


మరిన్ని
తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 13 , 2024 | 05:35 PM