Share News

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:41 PM

Vikarabad News: మేక వన్నె పులి.. అంటారు. ప్రస్తుతం దొంగలు రోజుకో ప్లాన్‌తో ప్రజలను ఇలాగే దోచుకుంటున్నారు. తాజాగా నయా ప్లాన్‌తో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లాలో కొత్త తరహా దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూసేందుకు కుటుంబం లాగే ఉంటూ.. పక్కా స్కె్చ్ వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!
Robbery in Car

వికారాబాద్, ఆగష్టు 07: మేక వన్నె పులి.. అంటారు. ప్రస్తుతం దొంగలు రోజుకో ప్లాన్‌తో ప్రజలను ఇలాగే దోచుకుంటున్నారు. తాజాగా నయా ప్లాన్‌తో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లాలో కొత్త తరహా దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూసేందుకు కుటుంబం లాగే ఉంటూ.. పక్కా స్కె్చ్ వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేట్ వనంపల్లి దగ్గర దొంగలు రెచ్చిపోయారు. కుటుంబ సభ్యులు మాదిరిగానే కారులో తిరుగుతూ ఒంటరి మహిళలే టార్గెట్‌గా బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. మీనపల్లికి చెందిన మహేశ్వరి తన తల్లి కాంతమ్మ, మూడేళ్ల కూతురుతో కలిసి గేట్ వనంపల్లి దగ్గర ఆటో కోసం రోడ్డుపై ఎదురు చూస్తున్నారు.


కాసేపటిలో వారి వద్దకు ఓ ఎర్టిగా కారు వచ్చింది. కారులో ముగ్గురు చిన్న పిల్లలు, రెండు జంటలు ఉన్నారు. మీనపల్లి కలాన్ వెళ్తున్నామని, కారులో రావొచ్చని చెప్పారు. కారులో పిల్లలు, ఆడవారు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుకొని మహేశ్వరి నమ్మింది. మహేశ్వరి తన కూతురుతో కలిసి కారు ఎక్కింది. కొంత దూరం వరకు బాగానే ఉన్నారు. ఆ తరువాతే తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు కేటుగాళ్లు.


కారులో అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు.. మహేశ్వరి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారం లాక్కున్నారు. వీరి చర్యలకు భయపడిపోయిన మహేశ్వరి, ఆమె కూతురు అరుపులు, కేకలు వేశారు. దీంతో అరిస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు దుండగులు. బంగారం లాక్కున్న తరువాత ఎవరూ లేని చోట కారును ఆపేసి మహేశ్వరిని, ఆమె కూతురుని కిందకు దింపేసి పారిపోయారు. బాధితురాలి నేరుగా నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

ఫోగట్‌పై కుట్ర జరిగిందా.?

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక

సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 07 , 2024 | 05:42 PM