రోగ నిరోధక కణాలకు చిక్కదు.. దొరకదు!
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:04 AM
ఆరోగ్యంగా ఉండే వ్యక్తు ల నోరు, చిన్న లేదా పెద్ద ప్రేగులు, మూత్ర కోశంలో ఉండే వ్యాధికారకమైన కాండిడా గ్లాబ్రాటా అనే శిలీంధ్రం (ఫంగస్) రోగనిరోధక కణాలు చంపకుండా ఎలా తప్పించుకోగలుగుతుందో శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
కాండిడా ఫంగస్ గుట్టు విప్పిన సీడీఎఫ్‌డీ శాస్త్రవేత్తలు
హైదరాబాద్, అక్టోబరు 3: ఆరోగ్యంగా ఉండే వ్యక్తు ల నోరు, చిన్న లేదా పెద్ద ప్రేగులు, మూత్ర కోశంలో ఉండే వ్యాధికారకమైన కాండిడా గ్లాబ్రాటా అనే శిలీంధ్రం (ఫంగస్) రోగనిరోధక కణాలు చంపకుండా ఎలా తప్పించుకోగలుగుతుందో శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. హైదరాబాద్‌లోని డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ (సీడీఎ్‌ఫడీ)లోని బ్రిక్ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన ఈ శిలీంధ్రం పై పరిశోధనలు చేశారు. కాండిడా గ్లాబ్రాటా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా25 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ ఫంగస్ రోగనిరోధక శక్తి తక్కువున్న రోగుల రక్తప్రవాహం, అంతర్గత అవయవాలకు అంటువ్యాధులను వ్యాపింపజేస్తుంది. ఇతర ప్రధాన వ్యాధికారక ఫంగ్‌సలకు భిన్నంగా ఇది వ్యవహరిస్తుందని పరిశోధకులు రూపీందర్ కౌర్, సందీప్ పాత్రా తేల్చారు. ఐఎల్-8 అనే సైటోకైన్ ఉత్పత్తిని అణచివేయడం ద్వారా రోగనిరోధక కణాల దాడి నుంచి అది తప్పించుకుని రోగి శరీరంలో తిష్టవేస్తుందని గుర్తించారు.