Share News

Secunderabad: కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !

ABN , Publish Date - Aug 14 , 2024 | 08:59 AM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది.

Secunderabad: కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !

- బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు

- గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది. ఫలితంగా కంటోన్మెంట్‌లో భూగర్భ జలాల వినియోగంపై రెగ్యులర్‌గా ఆడిట్‌ చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బోర్‌వెల్స్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (డిగ్గింగ్‌ అండ్‌ యూజ్‌ ఆఫ్‌ బోర్‌వెల్స్‌ రెగ్యులేషన్స్‌ 2024) నిబంధనలు రూపొందించారు.

ఇదికూడా చదవం0డి: Hyderabad : విమానాశ్రయం కిటకిట..!


దీనిపై అభ్యంతరాలను తెలపాల్సిందిగా గత ఫిబ్రవరి 23న కంటోన్మెంట్‌ బోర్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 5వ తేదీ వరకు అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నూతన నిబంధనలను రూపొందించింది. తాజాగా వీటిని ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం కంటోన్మెంట్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బోర్‌వెల్స్‌పై సమగ్ర సర్వే చేయనున్నారు. వినియోగంలో ఉన్న బోర్‌వెల్స్‌ సంఖ్య, వాటిని ఎప్పుడు వేశారు, ఎంత లోతులో వేశారు.. తదితర సమాచారాన్ని సేకరిస్తారు.


city1.jpg

భూగర్భ జలాల లభ్యతపై కేంద్ర జలశక్తి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సర్వే చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తారు. గృహ అవసరాలకు, ఆర్మీ, పోలీసు, వ్యవసాయ, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు వినియోగించే బోర్‌వెల్స్‌(Borewells)ను క్రమబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు. మిగతా బోర్‌వెల్స్‌ను నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. నూతనంగా వేసే బోర్‌వెల్స్‌ను కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తోడితే ప్రతి కిలోలీటర్‌కూ 10 రూపాయల చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.


కాలనీల్లో బోర్‌వెల్స్‌ వేయాలంటే మూడు వేల రూపాయలు, బస్తీల్లో వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భూగర్భజలాలను కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. బోర్‌వెల్స్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. కాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 08:59 AM