Share News

Secunderabad: 100 సీసీ కెమెరాలతో నిఘా.. బందోబస్తులో 1,500 మంది పోలీసులు

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:02 PM

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి(Secunderabad Ujjain Mahakali) ఆషాఢ బోనాల జాతరకు పోలీసు శాఖ సర్వసిద్ధం చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధనరష్మీ పెరుమాళ్‌(DCP Sadhanarashmi Perumal) అన్నారు.

Secunderabad: 100 సీసీ కెమెరాలతో నిఘా.. బందోబస్తులో 1,500 మంది పోలీసులు

- ఉదయం 4గంటల నుంచి దర్శనానికి అనుమతి

- సికింద్రాబాద్‌ బోనాలకు సర్వం సిద్ధం

- నార్త్‌ జోన్‌ డీసీపీ సాధనరష్మీ పెరుమాళ్‌

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి(Secunderabad Ujjain Mahakali) ఆషాఢ బోనాల జాతరకు పోలీసు శాఖ సర్వసిద్ధం చేసినట్లు ఉత్తర మండల డీసీపీ సాధనరష్మీ పెరుమాళ్‌(DCP Sadhanarashmi Perumal) అన్నారు. జాతర ఆధ్యాంతం 24 గంటలు వంద సీసీ కెమేరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆది, సోమవారాలలో జరుగనున్న బోనాల జాతర భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం నార్త్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె భద్రతా ఏర్పాట్ల వివరాలను వివరించారు.

ఇదికూడా చదవండి: ఉజ్జయిని మహాకాళి బోనాలకు 175 ప్రత్యేక బస్సులు..


6 వైపుల నుంచి బోనాల క్యూ..

బాటా నుంచి, రోచా బజార్‌, అంజలి థియేటర్‌ నుంచి బోనాల క్యూలు రాగా, ఒక జనరల్‌ లైన్‌, కంచు బొమ్మ వైప ునుంచిమరొక సర్వీస్‌ లైన్‌ ఉంటాయి. సర్వీస్‌ లైన్‌లో కేవలం స్వచ్ఛంద సేవకులు రాకపోకలు సాగించడానికి, ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు తరలించడానికి వినియోగిస్తారు. క్యూ లైన్లలో ప్రతీ 60 అడుగుల దూరంలో ఓ అత్యవసర ద్వారం ఉంటుంది. శివశక్తులకు మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు బాటా వైపు నుంచి ప్రత్యేక అనుమతి ఉంటుంది. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంటుంది. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తున్న నేపఽథ్యంలో ఈ సంవత్సరం 10లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. అందుకు అనుగుణంగా పదిహేను వందల మంది పోలీసు సిబ్బంది, మహిళల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, జేబు దొంగలను అదుపులోకి తీసుకోవడానికి క్రైమ్‌ టీమ్స్‌ రంగంలోకి దించుతున్నారు.


ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌, మహంకాళి ఏసీపీ సర్దార్‌ సింగ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నోముల వెంకటేశ్వర్లు, మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌లు పాల్గొన్నారు.

పార్కింగ్‌ ప్రదేశాలు

1. జింఖానా గ్రౌండ్‌

2. తాజ్‌ ట్రైస్టార్‌ లేన్‌

3. హరి హరా కళాభవన్‌

4. ఓల్డ్‌ జైల్‌ఖానా

5. ఇస్లామియా హై స్కూల్‌

6. అడవయ్య చౌరస్తా


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 12:02 PM