Share News

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద భద్రత

ABN , Publish Date - Aug 27 , 2024 | 03:42 AM

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద భద్రత

పంజాగుట్ట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ మేరకు వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద సోమవారం ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.


ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్‌- కన్వెన్షన్‌ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్‌ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 27 , 2024 | 03:42 AM