Share News

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

ABN , Publish Date - Sep 27 , 2024 | 06:04 PM

అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది.

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

హైదరాబాద్: అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఏడు డైరెక్ట్ విమాన సర్వీసులను షురూ చేసింది.

ఇవి RGIA నుంచి రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మధ్య నడుస్తాయి. విమానయాన సంస్థ సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు అయోధ్యకు సర్వీసులు నడపనుంది. స్పైస్‌జెట్ జూన్ 1న హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమానాలను నిలిపేసింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు.


సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్-కాన్పూర్, హైదరాబాద్‌- అయోధ్య మధ్య వారానికి 4 రోజుల సర్వీసును, సెప్టెంబర్ 28 నుంచి హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు. భాగ్యనగరం నుంచి నెల రోజుల్లో 7 కొత్త సర్వీసులు ప్రారంభం కావడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 06:05 PM