Finance:ఫైనాన్స్ వ్యాపారులపై కొరడా.. రూ. కోటి 20 లక్షల నగదు సీజ్
ABN , Publish Date - Apr 13 , 2024 | 09:05 PM
ఎక్కువ వడ్డీ విధించే ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల శనివారం నాడు దాడులు నిర్వహించారు. ఉమ్మడి జగిత్యాల జిల్లా మెట్ పల్లి, సిద్దిపేటలో పోలీసులు దాడులు చేశాయి. సిద్దిపేట జిల్లాలో 24 బృందాలు దాడులు నిర్వహించాయి. 38 ఫైనాన్స్ సంస్థలపై కేసు నమోదు చేశారు.
సిద్దిపేట: ఎక్కువ వడ్డీ విధించే ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు (Police) కొరఢా ఝులిపించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల శనివారం నాడు దాడులు నిర్వహించాయి. ఉమ్మడి జగిత్యాల జిల్లా మెట్ పల్లి, సిద్దిపేటలో పోలీసులు దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 24 బృందాలు దాడులు చేశాయి. 38 ఫైనాన్స్ సంస్థలపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.కోటికి పైగా నగదు సీజ్ చేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..
వడ్డీ వ్యాపారుల నుంచి 490 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి 21 లక్షల 120 స్వాధీనం చేసుకున్నారు. 70 తులాల బంగారు ఆభరణాలు, 13 కేజీల వెండి కూడా సీజ్ చేశారు. ఎక్కువ వడ్డీ పేరుతో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతితో నిబంధనలకు లోబడి ఫైనాన్స్ ఇవ్వాలని సూచించారు.
KCR: ప్రలోభాలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం