Flood Relief: వయనాడ్ బాధితులకు సీతక్క ఆర్థిక సాయం
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:27 AM
వయనాడ్ విపత్తు బాధితులకు తెలంగాణ మంత్రి సీతక్క ఆర్థిక సాయం అందించారు.
రూ.20లక్షల చెక్కు, రూ.10లక్షల సరుకులు అందజేత
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వయనాడ్ విపత్తు బాధితులకు తెలంగాణ మంత్రి సీతక్క ఆర్థిక సాయం అందించారు. బాధితులకు అందించేందుకు ఆమె సేకరించిన రూ.20 లక్షల నిధులకు సంబంధించిన చెక్కును, రూ.10 లక్షలు విలువైన నిత్యావసర వస్తువులు, దుస్తులను వయనాడ్ ఎమ్మెల్యే టి.సిద్ధికి శనివారం స్వయంగా అందజేశారు.
వయనాడ్‌లో పర్యటించిన మంత్రి సీతక్క.. వరదలతో మృత్యువాత పడిన వారిని సామూహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటిక దగ్గరకు వెళ్లి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదారుస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి సీతక్క వెంట వెళ్లిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.