Share News

Cold Wave: మంచు కురిసే వేళలో..

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:20 AM

పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది.

Cold Wave: మంచు కురిసే వేళలో..
Weather

పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది. భువనగిరి శివారులోని వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 9.15 గంటలకు ‘ఆంధ్రజ్యోతి’ కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది. భువనగిరి ప్రాంతంలో ఉదయం పది తర్వాత కూడా మంచు ప్రభావం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగానూ చలి, మంచు తీవ్రత కొనసాగుతున్నాయి. శనివారం అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Dec 29 , 2024 | 09:51 AM