Share News

Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:31 AM

సోలార్‌ విద్యుదుత్పత్తికి అవసరమైన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుతో మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతోందని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌(ఏఆర్‌సీఐ) శాస్త్రవేత్త డాక్టర్‌ ఇబ్రమ్‌ గణేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

  • ఈ ప్యానెల్స్‌ వేడితో అకాల ప్రకృతి వైపరీత్యాలు

  • ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త డాక్టర్‌ ఇబ్రమ్‌ గణే శ్‌ ఆందోళన

పంజాగుట్ట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సోలార్‌ విద్యుదుత్పత్తికి అవసరమైన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుతో మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతోందని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌(ఏఆర్‌సీఐ) శాస్త్రవేత్త డాక్టర్‌ ఇబ్రమ్‌ గణేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సోలార్‌ ప్యానల్స్‌పై తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. సౌర ఫలకల ద్వారా 20శాతమే మేలు జరుగుతుండగా.. 80శాతం హాని జరుగుతోందన్నారు.


సోలార్‌ ప్యానల్స్‌తో 20శాతం సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా, 30శాతంకన్నాఎక్కువ కాంతిని, ఉష్ణశక్తిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఆ వేడి వల్ల అకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, సోలార్‌ ప్యానల్స్‌ మూలంగా కలిగే నష్టాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. తాను రూపొందించిన సెమీకండక్టర్‌ అండ్‌ లిక్విడ్‌ అసిస్టెడ్‌ ఫొటో థర్మల్‌ ఎఫెక్ట్‌(ఎ్‌సఎల్‌ఏపీఈ)వల్ల తక్కువ దుష్పరిణామాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Nov 26 , 2024 | 04:31 AM