Gaddam Prasad Kumar: మూసీ నది పుట్టిన చోటు నుంచే ప్రక్షాళన
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:12 AM
మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
వికారాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వికారాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళనను అది ప్రారంభమయ్యే అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని సూచించినట్లు తెలిపారు.
అనంతగిరి నుంచి హైదరాబాద్ చేరే మధ్యలో పలుచోట్ల మూసీ నదీ జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతగిరి నుంచే ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభిస్తేనే మూసీ నది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయవచ్చని చెప్పారు.