Share News

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:20 AM

అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.

Sabarimala: కాలినడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

  • ఇందుకు ప్రత్యేక ట్యాగ్‌ కేటాయింపు

  • త్వరలో అందుబాటులోకి: ట్రావెన్‌కోర్‌ బోర్డు

శబరిమల, డిసెంబరు 16: అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గంలో అయ్యప్ప సన్నిధానానికి చేరుకునే యాత్రికుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ సోమవారం తెలిపారు. ఇందుకు యాత్రికుల చేతికి ప్రత్యేక ట్యాగ్‌ను కేటాయిస్తామని, పంపా నుంచి అయ్యప్పన్‌ రోడ్డు మార్గం ద్వారా సన్నిధానంకు చేరుకునే భక్తులను నేరుగా దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు.


మరక్కూట్టం వద్ద ప్రత్యేక ట్యాగ్‌ కలిగిన భక్తులను శరంకుతి మార్గం ద్వారా కాకుండా నేరుగా చంద్రానందన్‌ రోడ్డు ద్వారా గుడికి వెళ్లే వెసులుబాటు ఉంటుం ది. పులిమేడు, ఎరుమేలి, నీలిమల మార్గాల నుంచి ప్రత్యేక ట్యాగ్‌లతో వచ్చే యాత్రికులను నేరుగా దర్శనానికి అనుమతిస్తామని ప్రశాంత్‌ తెలిపారు. ఇందుకు అటవీ శాఖ అధికారుల సహకారం తీసుకుంటామని, భక్తులకు ట్యాగ్‌లను అందించే బాధ్యతను వారికే అప్పగిస్తామని చెప్పారు.

Updated Date - Dec 17 , 2024 | 03:21 AM