Hyderabad: శబరిమలకు 34 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:28 AM
అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్‌ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): అయ్యప్పస్వామి భక్తుల రద్దీ మేరకు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో శబరిమలకు వెళ్లి రావడానికి వేర్వేరు స్టేషన్‌ల నుంచి 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 2025 జనవరి 7, 14, 21, 28 తేదీల్లో హైదరాబాద్-కొట్టాయం (07065), 8, 15, 22, 29 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్ (076066), 3, 10, 17, 24, 31 తేదీల్లో మౌలాలి-కొట్టాయం(07167), 4, 11, 18, 25, ఫిబ్రవరి1 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్(07168), జనవరి 5, 12, 19, 26 తేదీల్లో కాచిగూడ-కొట్టాయం(07169), 6, 13, 20, 27 తేదీల్లో కొట్టాయం-కాచిగూడ (07170), 4, 11, 18, 25 తేదీల్లో మౌలాలీ-కొల్లం(07171), 6, 13, 20, 27 తేదీ ల్లో కొల్లం-మౌలాలిలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాగా అయోధ్య, కాశీ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ఈనెల 11న సికింద్రాబాద్‌స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలును ఏర్పాటు చేసింది.