Share News

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:44 AM

రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

  • వేములవాడ ఆలయానికీ బంగారు తాపడం

  • రూ.60 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి

  • బాసర ఆలయానికి రూ.110 కోట్లు: కొండా సురేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్యావరణ పర్యాటకం(ఎకో-టూరిజం)తో పాటు ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని సమన్వయం చేసేందుకు టూరిజం సర్క్యూట్ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం, వసతి సౌకర్యాలు తదితర 24 రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.


యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాన్ని 60 కిలోల బంగారంతో తాపడం పనులు ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో అందుదబాటులో ఉన్న 65 కిలోల బంగారంతో గోపురం తాపడం పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భద్రాలచం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.60 కోట్ల వ్యయం చేయనున్నట్టు తెలిపారు. బాసరసరస్వతి ఆలయాన్ని రూ.110కోట్లతో పుననిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

Updated Date - Oct 19 , 2024 | 03:44 AM