Share News

FTL Fixing: హైడ్రాకు త్వరలోనే నిబంధనలు : శ్రీధర్‌ బాబు

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:19 AM

హైడ్రాకు త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడారు. చెరువుల వద్ద ఎఫ్‌టీఎల్‌ పరిధి ఫిక్సింగ్‌పై దృష్టి సారించామని, ఇప్పటికే హైదరాబాద్‌

FTL Fixing: హైడ్రాకు త్వరలోనే నిబంధనలు : శ్రీధర్‌ బాబు

హైడ్రాకు త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడారు. చెరువుల వద్ద ఎఫ్‌టీఎల్‌ పరిధి ఫిక్సింగ్‌పై దృష్టి సారించామని, ఇప్పటికే హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో 300లకుపైగా చెరువులకు ఎఫ్‌టీఎల్‌ ఫిక్స్‌ చేసినట్లు వివరించారు. కొత్త మునిసిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాలు మునిసిపాల్టీల్లో విలీనమైన సందర్భంలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పపరు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని గ్రామాలన్నింటినీ జీహెచ్‌ఎంసీ పరిధిలో విలీనం చేయాలనే ప్రతిపాదన లేదని ఆయన తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 04:19 AM