Share News

Rainfall: పిడుగుపాటుకు ఇద్దరి మృతి..

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:48 AM

రాష్ట్రంలో అక్కడక్కడ ఆకస్మిక వానలు పడ్డాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, పత్తి తడిసిపోయింది. కొన్నిచోట్ల ఆయా పంటలకు కూడా నష్టం వాటిల్లింది.

Rainfall: పిడుగుపాటుకు ఇద్దరి మృతి..

  • రాష్ట్రంలో అక్కడక్కడ వానలు.. తడిసిన ధాన్యం, పత్తి బస్తాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో అక్కడక్కడ ఆకస్మిక వానలు పడ్డాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, పత్తి తడిసిపోయింది. కొన్నిచోట్ల ఆయా పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిశాయి. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మం డలం దున్నరలో గొర్రెలను మేపేందుకు వెళ్లిన కాపరులు బండారు బేతయ్య (41), డాకూరి భరత్‌ (17) పిడుగుపడి మృతి చెందారు.


ఖమ్మం జిల్లాలో పెనుబల్లిలో అత్యధికంగా 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని 2వేల వరకు పత్తి బస్తాలు తడిసిపోయాయి. కరీంనగర్‌ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా రామగుండం, పాలకుర్తి మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లో పోసిన ధాన్యం తడిసింది. ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. పొట్టదశలో ఉన్న వరి నేలకొరగ్గా.. పత్తి పంట తడిసి ముద్దయింది. వికారాబాద్‌లో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వాన అలజడి సృష్టించింది. రహదారులన్నీ జలమయమవ్వగా.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

Updated Date - Oct 31 , 2024 | 04:48 AM