Supreme Court: జీవో-46పై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:30 AM
పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో-46పై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కారుకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో-46పై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కారుకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక పోలీసుల భర్తీ విషయంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53 శాతం, మిగిలిన రాష్ట్రానికి 47శాతం పోస్టులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ఈ నోటీసులు ఇచ్చింది. తొలుత ఇదే విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురయింది.
దాంతో మాటూరి శ్రీకాంత్, గోగుల సందీప్, రూపావత్ శంకర్, రామావత్ అజయ్, బొమ్ము ఆంజనేయులు సహా మరికొందరు అక్టోబరు 18న సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.