Share News

ఓటుకు నోటు కేసు విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:44 AM

ఓటుకు నోటు కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ తప్పుకొన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని, తాను నిర్దోషినని పేర్కొంటూ జెరూసలేం మత్తయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా... గతంలోనే న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

ఓటుకు నోటు కేసు విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ

న్యూఢిల్లీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ తప్పుకొన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని, తాను నిర్దోషినని పేర్కొంటూ జెరూసలేం మత్తయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా... గతంలోనే న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. అయితే, ఆ కేసు నుంచి మత్తయ్య పేరును క్వాష్‌ చేయడాన్ని (తొలగించడాన్ని) 2016 జూలై 6న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది.


ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ బేలా ఎమ్‌. త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే.. తాను గతంలో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పని చేసినందున... ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని సతీశ్‌ చంద్ర శర్మ తెలిపారు. కాగా, ఈ నెల 12న మరో ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అమికస్‌ క్యూరీ స్థానంలో మత్తయ్య మరో న్యాయవాదిని నియమించుకున్నారు. ఈ విషయాన్ని మత్తయ్య తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు.

Updated Date - Nov 05 , 2024 | 04:44 AM