Jubilee Hills: సీఎం రేవంత్ నివాసం వద్ద బ్యాగు కలకలం
ABN , Publish Date - Sep 16 , 2024 | 04:18 AM
సీఎం రేవంత్ నివాసం వద్ద కనిపించిన ఓ బ్యాగు కలకలం సృష్టించింది.
బంజారాహిల్స్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ నివాసం వద్ద కనిపించిన ఓ బ్యాగు కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలో ఓ నలుపు రంగు బ్యాగు పడి ఉంది. దాన్ని చూసిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఎవరూ దాని గురించి రాకపోవడంతో సీఎ్‌సడబ్ల్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి మెటల్ డిటెక్టర్‌తో బ్యాగును పరిశీలించి, కార్యాలయానికి తరలించారు. అందులో ఏముందనే దానిపై స్పష్టత రాలేదు.