Share News

Sathupalli: మనిషికి విలువలు, వ్యక్తిత్వం ఉండాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:06 AM

వ్యక్తిత్వం, విలువలు ఉంటే మనిషి అద్భుతమైన శక్తిని సాధించగలుగుతాడని హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు.

Sathupalli: మనిషికి విలువలు, వ్యక్తిత్వం ఉండాలి

  • రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద

  • సత్తుపల్లిలో తెలుగు రాష్ర్టాల 6వ భక్త సమ్మేళనం

సత్తుపల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యక్తిత్వం, విలువలు ఉంటే మనిషి అద్భుతమైన శక్తిని సాధించగలుగుతాడని హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 6వ భక్త సమ్మేళనం శనివారం స్థానిక మాధురి ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. మొదటి రోజు విద్యార్థుల సమ్మేళనంలో స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ అనవసర పనులతో సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. సమయపాలన అలవరచుకోవాలని సూచించారు.


ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి స్వామి వివేకానంద అని తెలిపారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌ కార్యదర్శి స్వామి శితికంఠానంద మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తితో యువత జాగృతం కావాలన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి మాట్లాడుతూ మనిషిలో దైవత్వం నింపడమే అన్నిమతాల సారాంశమన్నారు. అంతకుముందు సత్తుపల్లిలో 2వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Dec 29 , 2024 | 05:06 AM