Share News

Talasani Srinivas Yadav: తలసాని ఇంట విషాదం..

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:00 AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో శంకర్ యాదవ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Talasani Srinivas Yadav: తలసాని ఇంట విషాదం..

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, శ్రీనివాస్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో శంకర్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నేటి తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూనే శంకర్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా శంకర్ నాయక్ పని చేశారు.

Updated Date - Jun 10 , 2024 | 11:17 AM