Teacher Arrested: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, సస్పెన్షన్
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:15 AM
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వికారాబాద్ జిల్లా ధారూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి.
ధారూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వికారాబాద్ జిల్లా ధారూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. ధారూరు మండల పరిధిలోని స్టేషన్ ధారూరు ప్రాథమికోన్నత పాఠశాలలో నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన గొల్ల కిష్టయ్య ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన కొద్దిరోజులుగా మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడు.
ఈ క్రమంలో పాఠశాలలో కొంతమంది విద్యార్థినులను అసభ్య చేష్టలు, మాటలతో వేధించాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే చితక్కొడతానని బెదిరించేవాడు. దీంతో శుక్రవారం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా కిష్టయ్యను సస్పెండ్ చేస్తూ డీఈవో రేణుకాదేవి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.