Teacher postings: కొత్త టీచర్ల చేరిక నేడే
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:06 AM
కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాఽధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో బుధవారం ఉదయం చేరనున్నారు.
పూర్తయిన కౌన్సెలింగ్.. విడుదల కానున్న సీనియర్లు
ఇంటర్ అడ్మిషన్ల గడువు ఈ నెల 20 దాకా పెంపు
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ను ఇచ్చేందుకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపాఽధ్యాయులు తమకు కేటాయించిన ఆయా పాఠశాలల్లో బుధవారం ఉదయం చేరనున్నారు. రాష్ట్రంలో 10,006 మంది టీచర్లను ప్రభుత్వం కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. కాగా, కౌన్సెలింగ్ సందర్భంగా పలుచోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఖాళీల విషయంలో స్పష్టత లోపించడంతో, మధ్యాహ్నం వరకు సమస్యను పరిష్కరించి అనంతరం కౌన్సెలింగ్‌ను నిర్వహించారు.
జూలైలో జరిగిన బదిలీల్లో చాలా మంది ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించినా... టీచర్ల కొరత కారణంగా వారు రిలీవ్ కాలేదు. కొత్త ఉపాధ్యాయులు చేరబోయే స్థానాల్లో సీనియర్లు ఉంటే వారు గతంలో కేటాయించిన స్కూళ్లకు వెళ్లనున్నారు. ఇదిలావుండగా, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు.