Share News

New Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న టీ ఎంపీలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 08:27 PM

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.

New Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న టీ ఎంపీలు
PM Modi

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీతో.. తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యేందుకు ముహుర్తం ఖరారు అయింది. బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో వారు భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా ప్రధాని మోదీతో బీజేపీ ఎంపీలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంపీలు ఈటల రాజేందర్, దర్మపూరి అర్వింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గడ్డం నగేష్ తదితరులు పాల్గొనున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భారీ అగ్నిప్రమాదం


సర్వే అనంతరం స్థానిక ఎన్నికలు..

తెలంగాణలో ప్రస్తుతం కుల గణన సర్వే జరుగుతుంది. ఈ సర్వే మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో సైతం అదే తరహాలో తమ ప్రతాపం చూపేందుకు సమాయత్తమవుతుంది.

Also Read: రూ. 24 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత


బీఆర్ఎస్ సరే సరి..

ఇక బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు సైతం గల్లంతయ్యాయి. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలపై స్పందించక పోవడం ఒకటైతే.. ఆయన ఫామ్ హౌస్ వదిలి బయటకు రాకపోవడం ఆ పార్టీకి మరో లోపం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీహాడ్ జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఆమె ఎక్కడ బయట కనిపించడం లేదు.

Also Read:సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


ఇద్దరు ఇద్దరే కానీ...

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు ఆయన సమీప బంధువు మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమే ప్రజా క్షేత్రంలో ఉన్నారు. వీరిద్దరు.. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూ అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరిద్దరు.. కారు పార్టీని షికారు చేయిస్తారా? అంటే సందేహమేనని ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా నడుస్తుంది.

Also Read రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు


ఇదే సరైన సమయమా ?

ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రంగంలోకి దిగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యచరణ సిద్దం చేసుకుంటుంది. అందులోభాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయనే ఓ ప్రచారం అయితే సాగుతుంది.

Also Read: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల


చర్చకు కీలక అంశాలు..

అలాగే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రధానితో జరిగే భేటీలో ఎంపీలు చర్చించే అవకాశముందని సమాచారం. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. మళ్లీ మంగళవారం నుంచి ఆయా సభలు యధావిధిగా కొనసాగనున్నాయి.

Also Read: మున్సిపల్ కమిషనర్‌ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం

For Telangana News And Telugu News

Updated Date - Nov 26 , 2024 | 08:42 PM