CM Revanth Reddy: హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ!
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:23 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్త విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఢిల్లీ వచ్చారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో బిజీగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఢిల్లీలో మకాం
పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఆశావహులు అందరూ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వడంతో బీసీ నేతకు పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేసులో మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మధుయాష్కీకి రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఎదిగారని, ఆయనపై హైకమాండ్‌కు సాప్ట్ కార్నర్ ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఎవరా నలుగురు..?
మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. నలుగురికి బెర్త్ కన్ఫామ్ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ నలుగురు ఎవరనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో ముగ్గురికి బెర్త్ కన్ఫామ్ అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
TS News: అయ్యో ఎంతటి ఘోరం... ఐదేళ్ల చిన్నారి తలలో పెన్ను గుచ్చుకోవడంతో..
సీతక్కకు హోం శాఖ..!!
సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే సీతక్క మంత్రి పదవి మారనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ప్రమోషన్ ఇచ్చి హోం మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి కేటాయించలేదనే విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..
Harishrao: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌పై క్రిమినల్ కేసుపై హరీష్‌రావు రియాక్షన్
Read Latest Telangana News AND Telugu News