Share News

CM Revanth: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 12 , 2024 | 09:55 PM

గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ రేసు స్కాంలో చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు బీజేపీని విమర్శించిన కేటీఆర్, ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీ నేతలను కలుస్తున్నారని గుర్తుచేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వచ్చారని తెలిపారు.

CM Revanth: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్- బీఆర్ఎస్ నేతల మధ్య ఈ రేస్ స్కామ్ గురించి డైలాగ్ వార్ జరుగుతోంది. స్కామ్‌కు కారణం కేటీఆర్ అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే.. ఈ రేస్ ప్రారంభించింది గత ప్రభుత్వాలేనని బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


KTR.jpg


అనుమతి రాగానే..

‘ఈ రేసు స్కామ్‌లో తప్పు చేసిన వారిని వదలం. ఆ స్కామ్‌కు సంబంధించి గవర్నర్ అనుమతి రాగానే చర్యలు ఉంటాయి. తప్పు చేసిన వారికి అరెస్ట్ చేస్తాం. సడెన్‌గా కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వచ్చారు. ఈ రేస్ స్కామ్ నుంచి తప్పుకునేందుకు ఢిల్లీ వచ్చారు. గతంలో బీజేపీని అంతం చేస్తానని కేటీఆర్ అన్నారు. మరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారు. మహారాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించడం కాదా అని’ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.


congress.jpg


దాడులను ఉపేక్షించం..

వికారాబాద్ కలెక్టర్ దాడి గురించి రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. దాడుల వెనక ఎంతవారు ఉన్నా సరే వదిలేది లేదు. దాడులు చేయించిన వారిని అరెస్ట్ చేయడం ఖాయం. దాడుల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించరు. కేటీఆర్ ఎందుకు మాట్లాడరు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి..

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Attack on Collector: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 09:55 PM