Share News

CM Revanth: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో భేటీ

ABN , Publish Date - Aug 09 , 2024 | 07:07 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వరసగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, రాయితీ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

CM Revanth: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో భేటీ
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వరసగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, రాయితీ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


గూగుల్ కంపెనీ ప్రతినిధితో భేటీ

సీఎం రేవంత్ రెడ్డి నేడు గూగుల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బయో డిజైన్ సెంటర్‌కి వెళతారు. వర్సిటీలో సస్టెనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చిస్తారు. అక్కడే పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు తగిన అవకాశాలు కల్పిస్తామని ప్రకటిస్తారు.


అమెజాన్ వీపీతో భేటీ

గూగుల్ ప్రతినిధులతో సమావేశం తర్వాత అమెజాన్ గ్లోబల్ డాటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం అవుతుంది. ఆ తర్వాత జెడ్ స్కాలర్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈవో జయ్ చౌదరీని కలుస్తారు. ఎనోవిక్స్, ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. స్మార్ట్ విలేజ్ మూమెంట్స్‌పై ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్‌ను కలుస్తారు. తర్వాత ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది.

Updated Date - Aug 09 , 2024 | 07:07 AM