Share News

Farmers: ఖరీఫ్‌ పంట రుణాల పంపిణీ 56శాతమే!

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:04 AM

వానాకాలం సీజన్‌లో రైతులకు అప్పులు మంజూరు చేయటంలో బ్యాంకర్లు పూర్తిగా వెనకబడ్డారు. ఈ సీజన్‌లో 56ు రుణ లక్ష్యం మాత్రమే సాధించారు.

Farmers: ఖరీఫ్‌ పంట రుణాల పంపిణీ 56శాతమే!

  • బ్యాంకర్ల రుణ లక్ష్యం రూ.48,888 కోట్లు

  • రైతులకు ఇచ్చింది 27,485 కోట్లు మాత్రమే

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో రైతులకు అప్పులు మంజూరు చేయటంలో బ్యాంకర్లు పూర్తిగా వెనకబడ్డారు. ఈ సీజన్‌లో 56ు రుణ లక్ష్యం మాత్రమే సాధించారు. స్వల్ప కాలిక పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రకరకాల కొర్రీలు పెట్టడంతో.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదించిన రుణ ప్రణాళిక లక్ష్యం నీరుగారిపోయింది. రాష్ట్రంలో 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా.. ఇందులో 21.67 లక్షల మంది రైతులకు మాత్రమే అప్పు పుట్టడం గమనార్హం. దీంతో రైతులు ప్రైవేటులో అధిక వడ్డీకి అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వచ్చింది. 2024- 25 వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో బ్యాంకుల ద్వారా రూ.48,888 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలు పంపిణీ చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కానీ, రూ. 27,485 కోట్ల రుణాలను మాత్రమే రైతులకు అందజేశారు. రుణ మాఫీ పథకం వర్తించిన రైతులకు మాత్రమే పంట రుణాలు అందాయని, రుణమాఫీ పొందని రైతులకు మంజూరు చేయలేదని తెలుస్తోంది.

Updated Date - Nov 21 , 2024 | 04:04 AM