Share News

Hyderabad: 18 పట్టణాభివృద్ధి సంస్థలు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:15 AM

వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రమంతా ఒకే విధమైన బృహత్తర ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Hyderabad: 18  పట్టణాభివృద్ధి సంస్థలు!

  • రాష్ట్రంలో ఇప్పటికే 9.. మొత్తం 27కు చేరిక

  • త్వరలో కొత్త యూడీఏల పరిధిలో బిల్డింగ్‌, లేఅవుట్‌ ఫీజులపై మార్గదర్శకాలు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రమంతా ఒకే విధమైన బృహత్తర ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరో 18 పట్టణ అభివృద్ధి అథారిటీల (యూడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 9 యూడీఏలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 18 యూడీఏలతో కలిపి వీటి సంఖ్య 27కు చేరింది. యూడీఏల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి.


రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో యూడీఏలను ఏర్పాటు చేసినట్టు పురపాలక శాఖ పట్టణ ప్రణాళిక అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లా కలెక్టర్ల నుంచి అందినప్రతిపాదనల ఆధారంగా యూడీఏల పరిధిని నిర్ణయించినట్టు చెప్పారు. 18 యూడీఏల గెజిట్‌ పబ్లికేషన్‌ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ యూడీఏల పరిధిలో త్వరలోనే బిల్డింగ్‌, లేఅవుట్‌ ఫీజులు, ఇతర అంశాలపై మార్గదర్శకాలు జారీ కానున్నాయి. యూడీఏలతో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Oct 22 , 2024 | 04:15 AM