షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:17 AM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ వామపక్ష పార్టీలు ఖండించాయి.
30న జరిగే నిరసనకార్యక్రమాలను జయప్రదం చేయండి: లెఫ్ట్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ వామపక్ష పార్టీలు ఖండించాయి. అమిత్‌షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, దీనిపై ఇంత వరకు ప్రధానమంత్రి మోదీ స్పందించలేదని పేర్కొన్నాయి. డిసెంబరు 30న దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. అమిత్‌షా వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.